పాఠశాలల్లో పోషకాహారాన్ని పెంచే కొత్త పథకం

పాఠశాలల్లో పోషకాహారాన్ని పెంచే కొత్త పథకం

MDK: జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహరంతో పాటు పాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యం సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, మంగళ, గురు, శనివారాల్లో రాగిజావ పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు మరింత పోషకాహారం అందించే ఉద్దేశంతో రానున్న విద్యాసంవత్సరం నుంచి రోజూ ఉదయం అల్పాహారం, మూడు రోజులు పాలు అందించేందుకు సిద్ధమవుతోంది.