ఖమ్మం మార్కెట్‌లో పడిపోయిన ‘మిర్చి ఘాటు’
ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెలలో క్వింటాకు రూ. 20,000 పలికిన ధర, ప్రస్తుతం రూ. 18,400కు పడిపోయింది. చైనాలో 'తేజా' రకం సాగు పెరగడంతో ఎగుమతి ఆర్డర్లు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నిత్యం 30 వేల బస్తాల సరకు వస్తున్నా, ఆశించిన ధర రాకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.