ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

ప్రకాశం: మార్కాపురంలో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడు దోర్నాల మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. అతని వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నామని సీఐ మీడియాకు తెలిపారు.