మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్

మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్

ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ రక్తదానం చేసి తన మానవత్వం చాటుకున్నారు. ఓ గర్భవతికి ఆపరేషన్ సమయంలో రక్తం అవసరమైందని తెలుసుకున్న కానిస్టేబుల్ మంగళవారం ఉలవపాడు వెళ్లి ఓ ఆసుపత్రిలో ఆమెకు కోసం రక్తదానం చేశాడు. ఆపద సమయంలో రక్తదానం చేసిన కానిస్టేబుల్‌ని పలువురు అభినందిస్తున్నారు.