VIDEO: రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
విశాఖలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాటి చెట్ల పాలెం నుంచి కంచరపాలెం వైపు వెళ్లే మార్గంలో హైవేపై ఒకే దిశలో వెళ్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎక్సైజ్ కానిస్టేబుల్ లగుడు సింహాచలం నాయుడు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.