యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు

RR: ఫరూఖ్ నగర్ మండలంలోని రైతులు యూరియా బస్తాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. మండలానికి 20 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఫరూఖ్ నగర్ మండలానికి ప్రతిరోజు 500 బస్తాల యూరియా వస్తుందన్నారు. అవసరమైన రైతులు ఆయా సెంటర్లలో యూరియా బస్తాలు పొందవచ్చని పేర్కొన్నారు.