పెద్దచెరువు శివారులో మృతదేహం లభ్యం

పెద్దచెరువు శివారులో మృతదేహం లభ్యం

KMR: జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి శివారులో ఉన్న పెద్ద చెరువులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో కాలనీ అధ్యక్షురాలు బాజా లలిత పోలీసులకు తెలియజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.