'ధరణి పోర్టల్‌తో భూములు కోల్పోయాం'
PDPL: గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా తమ భూములను కోల్పోయామంటూ పలువురు బాధితులు ధర్మారం (M)లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ద్వారా తమకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని ఏళ్లుగా పహానిలో ఉన్న తమ భూములను స్థానిక పుస్కూరి వంశానికి చెందిన దొరలు తమ భూములు అక్రమంగా పట్టాలు చేసుకున్నారని ఆరోపించారు.