విధుల్లో చేరిన గనులశాఖ అధికారులకు పోస్టింగ్‌లు

విధుల్లో చేరిన గనులశాఖ అధికారులకు పోస్టింగ్‌లు

AP: దాదాపు 13 నెలలపాటు సెలవులో ఉండి, ఇటీవల విధుల్లో చేరిన గనులశాఖ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు ఉప సంచాలకులు, నలుగురు సహాయ సంచాలకులకు గతంలో వారు పనిచేసిన స్థానాల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. అలాగే, వర్కింగ్ ఎరేంజ్‌మెంట్ కింద ఇతరచోట్ల విధులు అప్పగిస్తూ మెమో జారీ చేసింది. దీంతో మరికొందరికి బదిలీలు జరిగాయి.