సమాధానం ఇచ్చేందుకు ఇండిగోకు మరింత గడువు

సమాధానం ఇచ్చేందుకు ఇండిగోకు మరింత గడువు

ఇండిగో విమానయాన సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం పట్ల వివరణ ఇవ్వాలని సంస్థ CEO పీటర్ ఎల్బర్స్‌కు DGCA షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులకు జవాబు ఇవ్వడానికి మరొక రోజు గడువు ఇవ్వాలని CEO DGCAను కోరారు. దీనిపై స్పందించిన DGCA.. మరో 24 గంటల పాటు సమయాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. ఈ గడువును సోమవారం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది.