చెంగలమ్మ ఆలయానికి నిత్య అద్భుత చిత్ర సమర్పణ
TPT: ఉగాది పర్వదినం సందర్భంగా చెంగలమ్మ అమ్మవారి ఆలయానికి చెందిన దైవిక దృశ్యాన్ని నిత్య అనే యువ కళాకారిణి అద్భుతంగా చిత్రించి ఆలయ నిర్వహణకు సమర్పించింది. ఈ చిత్రంలో అమ్మవారి సౌందర్యం, ఆధ్యాత్మిక వాతావరణం ఆకట్టుకునేలా ప్రతిబింబించడంతో భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఆలయ నిర్వాహకులు నిత్య ప్రతిభను అభినందించారు.