ప్రభుత్వ డిగ్రీ కళాశాలతోపోటీపరీక్షల శిక్షణకు ఒప్పందం

NZB: గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో విద్యార్థులకు జీవన నైపుణ్యం, పోటీ పరీక్షల శిక్షణకు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కళాశాల టీఎస్ కేసీతో కలిసి రెండేళ్లు పనిచేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజర్ చందర్ ఉన్నారు.