లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ క్యాలెండర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే
సత్యసాయి: కదిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ 2026 నూతన ఆంగ్ల క్యాలెండర్లను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆవిష్కరించారు. స్వామి వారి సన్నిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ క్యాలెండర్లలో ఆలయ విశేషాలు, పండుగలు, ముఖ్యమైన తిథుల వివరాలను పొందుపరిచారు.