ప్రముఖ విద్యావేత్తకు ఉపాధ్యాయుల ఘన సన్మానం

ప్రముఖ విద్యావేత్తకు ఉపాధ్యాయుల ఘన సన్మానం

హనుమకొండ జిల్లా కేంద్రంలో సోమవారం ప్రముఖ విద్యావేత్త, వేద పండితులు పరిటాల బాలకృష్ణమూర్తిని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీ సీ టీ యు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు పెరుమర్ల సాంబమూర్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు.