'విద్యుత్ బిల్లుల వసూళ్లు నిలిపివేయాలి'
MLG: క్షౌరశాలల విద్యుత్ బిల్లుల వసూళ్లను నిలిపివేయాలని నాయి బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. విద్యుత్ సబ్సిడీ బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరింది. ములుగు జిల్లా విద్యుత్ ఎస్‌ఈకి వినతిపత్రం అందజేశారు.సెలూన్ యజమానులపై ఒత్తిడి చేయడం సరైంది కాదని హెచ్చరించారు. డిమాండ్ నెరవేర్చకపోతే ఆందోళన చేస్తామని తెలిపారు.