మహిళను కాపాడిన పోలీసులు
ELR: బుట్టాయగూడెం మండలం జైనవారి గూడెంకి చెందిన మహిళ వెల్తురువారి గూడెం వెళ్తుండగా జల్లెరు కాలువ దాటే క్రమంలో నీటి ప్రవాహానికి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై దుర్గా మహేశ్వర రావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వాగులో గాలించి మహిళను రక్షించారు. భారీ వర్షాలు నేపథ్యంలో చెరువులు, కుంటల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.