అంగన్వాడి సెంటర్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
NRPT: మద్దూరు మండల పరిధిలోని చెన్వార్ మంగళవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆకస్మికంగా పర్యటించారు. ఆయన అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసి, విద్యార్థుల హాజరు పట్టికను, భోజనాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.