అణు ప్లాంట్‌ను టార్గెట్ చేస్తాం: ఇరాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు ప్లాంట్‌ను టార్గెట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌లో పాలకులను మార్చేందుకు అమెరికా యత్నిస్తోందని ఆరోపించింది.