VIDEO: ROB డిజైన్ విజన్ @ 2047కి విరుద్ధంగా ఉంది

GNTR: సీఎం చంద్రబాబు విజన్ @ 2047కి విరుద్దంగా శంకర్ విలాస్ ఆర్వోబీ డిజైన్ ఉందని అరండల్ పేట, బ్రాడీపేట షాప్ ఓనర్స్ అండ్ షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గురుదత్ విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి తాము విరుద్దం కాదని స్పష్టం చేశారు. రూ.98కోట్లతోనే ఆర్వోబీ నిర్మించాలని చూస్తే భావితరాలు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.