రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం వివరాలు

TG: నిన్న రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లా టెక్మాల్‌లో అత్యధికంగా 19.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో 18 సెం.మీ, సంగారెడ్డి - నిజాంపేట్‌లో 16.48, యాదాద్రి - భువనగిరిలో 14.93, మహబూబ్‌నగర్ - భూత్పూర్‌లో 9 సెం.మీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.