నేపాల్‌ మాజీ ప్రధాని సతీమణి మృతి!

నేపాల్‌ మాజీ ప్రధాని సతీమణి మృతి!

నేపాల్‌లో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. నిరసనకారులు ఆ దేశ రాజధాని కాఠ్‌మండూలోని మాజీ ప్రధాని ఝాలానాథ్ ఖనాల్ నివాసానికి నిప్పంటించారు. ఈ ఘటనలో మాజీ ప్రధాని సతీమణికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం నెలకొంది.