చంద్ర గ్రహణం సందర్భంగా నూకాంబిక ఆలయం మూసివేత

చంద్ర గ్రహణం సందర్భంగా నూకాంబిక ఆలయం మూసివేత

AKP: అనకాపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానం మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం ఆలయాన్ని మూసివేసినట్లు దేవస్థానం ఛైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ తెలిపారు. తిరిగి చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని శుభ్రపరచి సంప్రోక్షణ చేసిన తర్వాత అమ్మవారి దర్శనాలు ఉంటాయని చెప్పారు.