శశి థరూర్‌కు అమిత్ షా 'స్పెషల్' రిక్వెస్ట్.. LSలో నవ్వులు
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చలోక్తులు విసిరారు. 'మనం అవిశ్వాసంపై చర్చిస్తున్నాం, నక్సలిజంపై క్లాసులు తీసుకోలేను' అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తీరును ఉద్దేశిస్తూ.. 'శశి థరూర్ వంటి సీనియర్ MPలైనా ఆయనకు పార్లమెంట్ మర్యాదలు నేర్పించాలి' అని సరదాగా అనడంతో సభలో నవ్వులు పూశాయి. షా పంచ్‌కు థరూర్ కూడా నవ్వడం విశేషం.