తాళం వేసిన ఇంట్లో చోరి

NRML: తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరబడి చోరికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని సాయినగర్ కాలనీలో అద్దెకి ఉంటున్న సామ్రాట్, కొడుకు అనారోగ్యంతో పట్టణంలోని ఆస్పత్రిలో చేరారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు దొంగతనానికి పాల్పడి 8 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.50 వేల నగదు పోయినట్లు బాధితులు తెలిపారు.