మార్టేరు గ్రామంలో జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు
W.G: పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలోని వేణుగోపాల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీడీపీవో కృష్ణ కుమారి బాలికల అభ్యున్నతిపై పలు అంశాలను వివరించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ సూర్య కుమారి, ఎంఎస్కేలు శ్రావణి, విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు.