దివ్యాంగుల్లో ఉల్లాసం కోసం క్రీడా పోటీలు: కృష్ణవేణి

దివ్యాంగుల్లో ఉల్లాసం కోసం క్రీడా పోటీలు: కృష్ణవేణి

VKB: దివ్యాంగుల్లో మానసిక ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి తెలిపారు. డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్‌లో వికలాంగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. దివ్యాంగులు ఎంతో ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారని ఆమె పేర్కొన్నారు.