రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
NTR: నందిగామలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐతవరం మద్రాస్ ఫిల్టర్ కాఫీ వద్ద కారు, బైకు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు కంచికచర్లకు చెందిన లక్ష్మీ నారాయణ (50)గా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.