దేవాలయంలో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

దేవాలయంలో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

NZB: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చోరీ జరిగిందని సర్వసమాజ్ సభ్యులు తెలిపారు. సోమవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ అధ్యక్షులు సుమన్, క్యాషియర్ రవి, దొండి శ్యామ్ తదితరులున్నారు.