మీకోసం కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన ఏఎస్పీ

మీకోసం కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన ఏఎస్పీ

కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను ఏఎస్పీ వివి. నాయుడు సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తే, వాటిపై చట్ట ప్రకారంగా విచారణ జరిపి పరిష్కరించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంటుందనన్నారు.