ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన MLA

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన MLA

BHPL: గణపురం మండలంలోని జంగుపల్లి, బస్వరాజుపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించుకోవాలని, ఈ కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు దళారుల బెడద ఉండదని, పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయన్నారు.