నవధాన్యాల అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ
CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత నవధాన్యాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.