తెలుగులో యాక్షన్ కింగ్ అర్జున్ 'మఫ్టీ పోలీస్'

తెలుగులో యాక్షన్ కింగ్ అర్జున్ 'మఫ్టీ పోలీస్'

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ నటించిన పోలీస్ థ్రిల్లర్ 'తీయవర్ కులై నడుంగ'. ఈ సినిమా తెలుగులో 'మఫ్టీ పోలీస్' పేరుతో ఈనెల 21న విడుదల కానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, నిర్మాత A.N. బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులో యాక్షన్, డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నిర్మాత తెలిపారు. తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.