పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగికి ఘన సన్మానం

పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగికి ఘన సన్మానం

WNP: ప్రతి ఉద్యోగి పదవి విరమణ అనంతరం తాను పనిచేసిన సంస్థకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు అందించాలని జిల్లా ఆర్ఎం సంతోష్ కోరారు. వనపర్తి ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మెకానికల్ ఫోర్స్‌గా పనిచేస్తూ పదవి విరమణ చేపడుతున్న దేవేందర్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగి పదవి విరమణ‌తో తమ జీవితం ఆగిపోయింది అనుకోకుండా సంస్థకు సేవలందించాలని తెలిపారు.