చెరువును తలపిస్తున్న పీహెచ్‌సీ
ASR: జీ.కె.వీధి మండలం పెద్దవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ లేక ఆవరణలో వర్షపు నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారుతోంది. చికిత్స కోసం వచ్చే రోగులు మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.