బాలయ్య ఫ్లెక్సీకి మ్యాన్షన్ హౌస్ మద్యంతో అభిషేకం
ATP: తాడిపత్రిలో 'అఖండ-2' సినిమా విడుదల సందర్భంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు హంగామా సృష్టించారు. అభిమానం పరాకాష్టకు చేరుకుని, బాలయ్య ఫ్లెక్సీకి మ్యాన్షన్ హౌస్ మద్యంతో అభిషేకం చేశారు. అనంతరం అభిమానులు డీజే పాటలకు డాన్స్‌లు చేస్తూ, థియేటర్ వద్ద టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌తో థియేటర్ల వద్ద సందడి నెలకొంది.