ట్రాఫిక్‌లో చిక్కుకున్న మాజీ మంత్రి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో శుక్రవారం మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు గంటలుగా వాహనాలు కదలకుండా నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ట్రాఫిక్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా చిక్కుకున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.