'చేనేత కార్మికుల కోసం రూ. 19 కోట్ల రుణమాఫీ'
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ శుక్రవారం చేనేత రుణమాఫీ, నేతన్న భద్రత పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం రూ. 19 కోట్ల రుణమాఫీ చేసిందని, కొత్తగా నేతన్న భద్రత పథకాన్ని తెచ్చిందని తెలిపారు.