'ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు'

'ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు'

నారాయణపేట జిల్లా కేంద్రంలోని వీర సావర్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణచైతన్య వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. యువకులు ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వాహనాలు నడపాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.