జిల్లాలో కల్తీ విత్తనాలపై స్పెషల్ టీం: ఎస్పీ

NGKL: జిల్లాలో కల్తీ విత్తనాల మీద నిఘా పెట్టినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా 10మంది పోలీసు అధికారులతో కూడిన ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ టీం అగ్రికల్చర్ ఆఫీసర్లతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. రైతులు మోసపోకుండా విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.