కూతురి అప్పగింతలు.. తల్లి హఠాన్మరణం

KMM: కారేపల్లి మండలం అబ్బాసుపురంలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కూతురు అప్పగింతల కార్యక్రమం జరుగుతుండగా తల్లి కుప్పకూలింది. అక్కడి వారు తల్లిని ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తల్లి హఠాన్మరణంతో కుటుంబంలో ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది.