ఈదురు గాలులకు ఒరిగిన విద్యుత్ స్తంభాలు

అనకాపల్లి: నక్కపల్లి మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శనివారం రాత్రి వీచిన గాలులకు చెట్ల కొమ్మలు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. రాజీవ్ నగర్ కాలనీలో భారీ వర్షానికి గాలి తోడవడంతో రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాలు ఒరిగిపోయాయి. పక్కకు ఒరిగి ప్రమాదకరంగా దర్శనమిచ్చాయి. పలుచోట్ల కరెంటు వైర్లు తెగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.