కావలి AMC డైరెక్టర్ పవన్‌పై దాడి

కావలి AMC డైరెక్టర్ పవన్‌పై దాడి

NLR: కావలి వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ఇడిముక్కాల పవన్‌పై కొందరు దాడి చేశారు. తుమ్మలపెంట రోడ్డులో ఉన్న ఓ రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు డైరెక్టర్ పవన్.. తన స్నేహితులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన కారు దిగుతున్న సమయంలో దుండగులు దాడి చేశారని స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని స్నేహితులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.