వడ్లపూడి దాడి కేసులో నిందితుడికి శిక్ష విధింపు
GNTR: మంగళగిరి పరిధిలో వడ్లపూడి సెంటర్‌లో జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు కోర్టు మూడేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 2019లో జరిగిన ఈ ఘటనలో కొల్లి పూర్ణచంద్రరావుపై దాడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో బుధవారం న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.