కుప్టీ సర్పంచ్ గంగారం కన్నుమూత
NRML: కుబీర్ మండలం కుప్టీ గ్రామ సర్పంచ్ పోతుగంటి గంగారం (42) శుక్రవారం కన్నుమూశారు. రెండు నెలల క్రితం భైంసా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన, చికిత్స పొంది ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇవాళ ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సర్పంచ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.