'మత సామరస్యానికి ప్రతీక రంజాన్'
MNCL: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, MLA కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా గిఫ్టులు అందిస్తుందన్నారు.