నిబంధనల ఉల్లంఘనపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

నిబంధనల ఉల్లంఘనపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

ఖమ్మం: ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1077ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ పట్ల ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్లు ముగిసి అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత ప్రలోభాలు పెరిగే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.