చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు
KMM: కామేపల్లి మండలంలోని పాతలింగాల పెద్ద చెరువు వద్ద కాల్వ క్రింద చేపలు పట్టేందుకు వెళ్లిన గోవింద్రాలకు చెందిన బానోత్ శ్రీను గల్లంతయ్యాడు. చేపలు పట్టే క్రమాన కాలు జారి వరద నీటిలో పడడంతో ఆయన గల్లంతయ్యాడని తెలిసింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా, శ్రీనుకు ఈత కూడా రాదని కుటుంబీకులు తెలిపారు.