సంగారెడ్డి: సీపీఆర్‌పై విద్యార్థులకు అవగాహన

సంగారెడ్డి: సీపీఆర్‌పై విద్యార్థులకు అవగాహన

సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం హోప్ న్యూరో హాస్పిటల్ వారి సౌజన్యంతో పాఠశాలలోని విద్యార్థులకు సీపీఆర్ పై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డాక్టర్ రాజేశ్ మాట్లాడుతూ.. ఎవ్వరికైనా గుండెపోటు వచ్చినప్పుడు వారికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, డాక్టర్లు పాల్గొన్నారు.