బోటు పైనుంచి జారిపడి మత్స్యకారుడు మృతి
కోనసీమ: కాట్రేనికోనలోని కొత్తపాలేనికి చెందిన సత్యం(55) చేపల వేటకెళ్లి మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు వల లాగుతుండగా ప్రమాదవశాత్తు బోటుపై నుంచి జారిపడి చనిపోయినట్లు బంధువులు తెలిపారు. సత్యం మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.