'పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు మంచివి'

KDP: పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు మంచివని కళాశాల ప్రిన్సిపాల్ అన్నారు. పులివెందుల వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం వినాయక చవితి సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నాగేంద్ర మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగించటం వలన కలిగే నష్టాలను వివరించారు.